సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Viral Video: లోన్ ఇస్తామంటూ స్కామర్ కాల్.. ఆడేసుకున్న బాలీవుడ్ యువ నటుడు

ABN, First Publish Date - 2022-01-19T18:47:24+05:30

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’తో మంచి బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సాధించిన నటుడు ఆయుష్ శర్మ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’తో మంచి బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సాధించిన నటుడు ఆయుష్ శర్మ. ఆ సినిమాలో ఎంతో సిరీయస్‌గా కనిపించిన ఆయన బయట చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఉంటాడు. తాజాగా ఓ స్కామర్‌ని ఈ నటుడు ఆడుకున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


అందులో.. ఆయుష్, అంతిమ్ సెట్స్‌లో నటి మహిమా మక్వాన్ కలిసి ఉండగా ఓ స్కామ్ కాల్ వచ్చింది. ఆమె 3 నుంచి 35 లక్షల అప్పును 10 సంవత్సరాలకి ఇస్తామని చెప్పింది. వెంటనే నాకు లక్షలు కాదు కోట్లు కావాలంటూ ప్రాంక్ చేశాడు. 


‘నేను చాలా పెద్ద కొరియోగ్రాఫర్‌ని మూడు లక్షలు నాకేం సరిపోతాయి. నాకు కోట్లలో కావాలం’టూ అడిగాడు ఆయుష్. అయితే కొద్దిసేపు తర్వాత ఆయన ఆడుకుంటున్నాడని అర్థం చేసుకున్న ఆ స్కామర్ ‘సర్.. మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేద’ని ఫోన్ పెట్టేసింది. ఆ ఫన్నీ వీడియోని మీరు ఓసారి చూసేయండి..



Updated Date - 2022-01-19T18:47:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!