సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకున్న ఆమీర్‌ఖాన్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-27T15:44:52+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. మూవీ కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి...

సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకున్న ఆమీర్‌ఖాన్.. కారణం ఏంటంటే..

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. మూవీ కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి సిద్ధంగా ఉండే ఈ నటుడిని అభిమానులు పర్ఫెక్షనిస్ట్ అని పిలుచుకుంటుంటారు. అందుకే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఆమీర్ నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్ధా’ త్వరలో విడుదలకానుంది. దీంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఈ స్టార్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


ఆమీర్ మాట్లాడుతూ.. ‘చాలాకాలం వరకూ నా పిల్లలకు ఏం కావాలో నాకే తెలియదు. అదే పెద్ద సమస్య. ఈ విషయం నాకు అర్థమవ్వడానికి చాలా సమయం పట్టింది. అప్పుడు నా మీదే నాకు చాలా కోపం వచ్చింది. దాంతో పాటు సినిమా మీద కూడా కోపం వచ్చింది. సినిమాలే నాకు, నా కుటుంబానికి మధ్య గ్యాప్‌కి కారణమైంది. అందుకే సినీ పరిశ్రమకి స్వస్తి చెప్పాలనుకున్నాను. అంతేకాకుండా సినిమాల్లో నటించడం కానీ, నిర్మించడం కానీ చేయకూడదనుకున్నాను.


గతంలోనే నేను నా రిటైర్‌మెంట్‌ను ప్రకటించాలనుకున్నాను. కానీ లాల్ సింగ్ చద్ధా సినిమా మార్కెటింగ్‌లో భాగంగా నేను చేస్తున్న జిమ్మిక్కుగా ప్రేక్షకులు భావిస్తారని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. అలాగే నా సినిమాల మధ్య సాధారణంగా 3, 4 ఏళ్లు విరామం తీసుకుంటాను. కాబట్టి లాల్ సింగ్ చద్దా తర్వాత, మరో 3, 4 సంవత్సరాల వరకు ఎవరికీ ఇబ్బంది ఉండదు. అలా నేను నిశ్శబ్దంగా సినిమాల నుంచి తప్పుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.


దీనిపై మాజీ భార్య కిరణ్ రావ్, పిల్లలు ఐరా, ఆజాద్ రియాక్షన్ గురించి ఆమీర్ మాట్లాడుతూ.. ‘నా రిటైర్‌మెంట్ గురించి భార్యా పిల్లలకి చెబితే నేను తప్పు చేస్తున్నట్లు హెచ్చరించారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య సమతుల్యతకి ప్రయత్నించమని నా పిల్లలు సూచించారు. ఈ దశలో కిరణ్ నాకు చాలా సహాయం చేసింది. నా నిర్ణయం విని తను ఏడ్చింది. తనకు సినిమా అంటే ఇష్టమని, సినిమా లేకుండా నన్ను ఊహించుకోలేనని ఆమె చెప్పింది. అందుకే ఆమెకి నా నిర్ణయాన్ని సమర్థించలేదు’ అని తెలిపాడు.

Updated Date - 2022-03-27T15:44:52+05:30 IST