సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bipasha Basu: బుజ్జాయి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసిన బిపాసా

ABN, First Publish Date - 2022-12-14T18:47:33+05:30

బాలీవుడ్ నటి బిపాసా బసు (Bipasha Basu), కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) కొన్ని రోజుల క్రితమే తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు పండంటి బుజ్జాయి నవంబర్ 12న పుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటి బిపాసా బసు (Bipasha Basu), కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) కొన్ని రోజుల క్రితమే తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఈ జంటకు పండంటి బుజ్జాయి నవంబర్ 12న పుట్టింది. తమ పాప దేవి పుట్టి నెల రోజులు కావడంతో ఈ జంట ఆ వేడుకను కేక్‌ను కట్ చేసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సాంగ్‌ను పాడారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘దేవి పుట్టి నెల రోజులు పూర్తయింది. ఆమెకు దీవెనలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మేం అందరికి రుణపడి ఉంటాం’’ అని బిపాసా క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోకు సెలబ్రిటీలతో సహా సామాన్యులు స్పందించారు. కామెంట్స్ వర్షం కురిపించారు.

బిపాసా బసు మొదట మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కార్పొరేట్’, ‘ఓంకార’, ‘ధూమ్ 2’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. కెరీర్ పీక్‌లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పింది. చివరగా ‘ఎలోన్’ లో నటించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ పరిచయమయ్యాడు. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఫలితంగా ఈ జంట 2016లో పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ‘టక్కరి దొంగ’ లో నటించింది. మహేశ్ బాబుగా జొడీగా కనిపించింది.

Updated Date - 2022-12-14T18:52:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!