సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bipasha Basu: బేబీ బంప్‌తో బాలీవుడ్ భామ.. పిక్స్ వైరల్

ABN, First Publish Date - 2022-08-16T19:24:23+05:30

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో బిపాషా బసు (Bipasha Basu), కరణ్‌ సింగ్ గ్రోవర్(Karan Singh Grover) జంట ఒకటి.,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో బిపాషా బసు (Bipasha Basu), కరణ్‌ సింగ్ గ్రోవర్(Karan Singh Grover) జంట ఒకటి. 2015లో వచ్చిన ‘అలోన్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్న సమయంలో ఈ కపుల్ మధ్యలో ప్రేమ చిగురించింది. ఒక ఏడాది డేటింగ్ తర్వాత ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా వివాహ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇటీవల ఈ బ్యూటీఫుల్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేశాయి. వాటిని కన్‌ఫార్మ్ చేస్తూ ఈ బిపాషా బేబీ బంప్‌(Baby Bump)తో ఉన్న పిక్స్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఆ పిక్స్‌లో ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ కూడా ఉన్నాడు.


ఆ పోస్ట్‌కి.. ‘కొత్త సమయం, ఒక కొత్త దశ, ఒక కొత్త కాంతి మా జీవితాల్లోకి ప్రవేశించింది. అది మా జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. మా మధ్య ప్రేమని ఇంకా పెరిగేలా చేస్తుంది. మేము ఈ జీవితాన్ని ఒంటరిగా ప్రారంభించి.. తర్వాత మేము ఒకరినొకరు కలుసుకుని ఇద్దరిగా మారాం. ఇద్దరిగా ఉన్న మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాం. మా ప్రేమ బిడ్డగా మారి మాకు మరింత ఆనందాన్ని ఇవ్వడానికి వస్తోంది. బిడ్డగా మా జీవితంలోకి సంతోషాన్ని తెస్తున్నందుకు ధన్యవాదాలు. ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రేమని పంచిన మీ అందరికీ, మీ ప్రార్థనలకి, మీ మంచి మనసుకి ధన్యవాదాలు. మీ అందరూ ఎప్పటికీ మాలో భాగంగా ఉంటారు’ అంటూ బిపాషా క్యాప్షన్ రాసుకొచ్చింది.


ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ పిక్స్ సైతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎంతోమంది అభిమానులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-08-16T19:24:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!