సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘బిగ్‌బీ’కి ‘బాహుబలి’ భోజనం.. ఓ ఆర్మీకీ సరిపోతుందంటూ..

ABN, First Publish Date - 2022-02-21T16:40:40+05:30

బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు నటుడు ప్రభాస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన నటుడు ప్రభాస్. అనంతరం ఆయనే చేస్తున్నవన్నీ దేశవ్యాప్తంగా అలరించే సినిమాలే. అయితే యంగ్ రెబల్‌స్టార్ తన సినిమాల్లో నటించే యాక్టర్స్‌కి ఇంట్లో వండిన భోజనం పెడుతుంటాడనే విషయం తెలిసిందే. ఈ డార్లింగ్ యాక్టర్ ఇంతకుముందు దీపికా పదుకొనే, కరీనా కపూర్‌కి ఇంటి భోజనం పంపించాడు. తాజాగా బాలీవుడ్ మెగా‌స్టార్, ప్రాజెక్ట్ కే కో-స్టార్ అమితాబ్ ‌బచ్చన్‌కి సైతం మీల్స్ పంపించాడట.


ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘టీ 4198.. 'బాహుబలి' ప్రభాస్.. మీ ఔదార్యాన్ని కొలవలేం. మీరు ఇంట్లో వండిన, రుచికరమైన ఆహారాన్ని నాకు పంపించారు. మీరు పంపించిన భోజనంతో ఓ ఆర్మీకి ఒకపూట కడుపునింపొచ్చు. మీరు ప్రత్యేకంగా తయారుచేయించిన కుక్కీలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్‌కి సంతోషం’ అని రాసుకొచ్చారు.



Updated Date - 2022-02-21T16:40:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!