సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ నటుడు Kartik Aaryan కు కోవిడ్ పాజిటివ్

ABN, First Publish Date - 2022-06-04T22:49:32+05:30

ఎటువంటి అండదండలు లేకుండా స్వశక్తితో బాలీవుడ్‌లో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లుకా చప్పీ’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటువంటి అండదండలు లేకుండా స్వశక్తితో బాలీవుడ్‌లో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లుకా చప్పీ’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఐఫా అవార్డ్స్ -2022(IIFA Awards 2022)లో కూడా ప్రదర్శన ఇవ్వాలి. అయితే, అంతకు ముందే ఆయనకు షాక్ తగిలింది. ఈ స్టార్ నటుడికీ కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపారు. కోవిడ్ పాజిటివ్ అని ఇన్‌స్టాస్టో‌రీలో రాశారు.   


కార్తిక్ ఆర్యన్ తాజాగా నటించిన చిత్రం ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2). కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఏప్రిల్ 20న విడుదలైంది. కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇప్పటికే రూ.130కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నిర్వహకులు ఐఫాలో కార్తిక్ ఆర్యన్‌ ప్రదర్శనను  ప్లాన్ చేశారు. కానీ, కరోనా పాజిటివ్ అని తేలాడంతో ఆ ప్రణాళికలన్ని విఫలం అయ్యాయి. 



Updated Date - 2022-06-04T22:49:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!