బాలీవుడ్ నటుడు Kartik Aaryan కు కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-06-04T22:49:32+05:30 IST

ఎటువంటి అండదండలు లేకుండా స్వశక్తితో బాలీవుడ్‌లో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లుకా చప్పీ’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి

బాలీవుడ్ నటుడు Kartik Aaryan కు కోవిడ్ పాజిటివ్

ఎటువంటి అండదండలు లేకుండా స్వశక్తితో బాలీవుడ్‌లో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లుకా చప్పీ’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. ఐఫా అవార్డ్స్ -2022(IIFA Awards 2022)లో కూడా ప్రదర్శన ఇవ్వాలి. అయితే, అంతకు ముందే ఆయనకు షాక్ తగిలింది. ఈ స్టార్ నటుడికీ కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపారు. కోవిడ్ పాజిటివ్ అని ఇన్‌స్టాస్టో‌రీలో రాశారు.   


కార్తిక్ ఆర్యన్ తాజాగా నటించిన చిత్రం ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2). కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఏప్రిల్ 20న విడుదలైంది. కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇప్పటికే రూ.130కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నిర్వహకులు ఐఫాలో కార్తిక్ ఆర్యన్‌ ప్రదర్శనను  ప్లాన్ చేశారు. కానీ, కరోనా పాజిటివ్ అని తేలాడంతో ఆ ప్రణాళికలన్ని విఫలం అయ్యాయి. Updated Date - 2022-06-04T22:49:32+05:30 IST

Read more