Farhan weds Shibani : బ్యాండ్, బాజా, బారాత్... Bollywood
ABN , First Publish Date - 2022-02-20T00:12:40+05:30 IST
బాలీవుడ్లో ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ వంటి చిత్రాల్లో నటించి
బాలీవుడ్లో ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫర్హాన్ అక్తర్. అతడు నాలుగేళ్లుగా శిబానీ దండేకర్‌తో డేటింగ్ చేస్తున్నాడు. తాజాగా ఫర్హాన్, శిబానీ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అతడి అభిమానులందరూ ఈ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వివాహానికి బీ టౌన్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయినట్టు తెలుస్తోంది. రియా చక్రవర్తి, హృతిక్ రోషన్, అనుష దండేకర్ వంటి సెలెబ్రిటీలు ఫర్హాన్, శిబానీ వెడ్డింగ్ సెరిమనీలో సందడి చేశారు.
ఫర్హాన్ అక్తర్‌కు గతంలోనే అధునా బబానీతో వివాహాం అయింది. ఈ దంపతుల మధ్య అనంతరం అనేక మనస్పర్థాలు తలెత్తాయి. దీంతో ఫర్హాన్ 2016లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం శిబానీ దండేకర్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కరోనా దృష్ట్యా వివాహాన్ని నిరాండబరంగా కానిచ్చారు. కొంతమంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయినట్టు బీ టౌన్ వర్గాలు తెలుపుతున్నాయి.