సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సన్నీలియోన్ వర్క్ పర్మిట్‌ క్యాన్సిల్

ABN, First Publish Date - 2022-03-12T22:45:13+05:30

పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన సుందరి సన్నీ లియోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన సుందరి సన్నీ లియోన్. ‘జిస్మ్-2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కరెంటు తీగ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ మధ్యనే ‘అనామిక’ వెబ్ సిరీస్‌లో కనిపించి అందరినీ అలరించింది. అయితే, సన్నీలియోన్ ఇండో-బంగ్లాదేశ్ చిత్రం ‘సోల్జర్స్’లో నటించనున్నట్టు గతంలోనే ప్రకటించింది. కానీ, తాజా సమాచారం ప్రకారం అందులో ఆమె నటించడం లేదు. అందుకు కారణమేంటంటే.. 


సన్నీలియోన్‌ ‘సోల్జర్స్’ చిత్రంలో నటించేందుకు గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం వర్క్ పర్మిట్‌ను జారీ చేసింది. కానీ, బంగ్లాదేశ్‌లో ఆమె అడుగుపెడితే నిరసన తెలుపుతామని కొన్ని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు హెచ్చరించాయి. దీంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం శాంతి, భద్రతలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకుంది. ఆమె వర్క్ పర్మిట్‌ను క్యాన్సిల్ చేసింది. బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమె వర్క్ పర్మిట్‌ను క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘సోల్జర్స్’ మూవీకి షమ్మీమ్ అహ్మద్ రోని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో సన్నీలియోన్‌తో సహా, 10మంది ఇండియన్ ఆర్టిస్టులు పాల్గొనాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం మార్చి ప్రారంభంలో వీరందరికీ వర్క్ పర్మిట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం సన్నీ లియోన్‌కు మాత్రం వర్క్ పర్మిట్‌ను నిరాకరించింది.

Updated Date - 2022-03-12T22:45:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!