‘భజరంగీ భాయిజాన్’ పాపకి భారతరత్న అంబేడ్కర్ అవార్డు.. సల్మాన్ ఖాన్‌కి అంకితమిచ్చిన నటి
ABN , First Publish Date - 2022-01-11T19:38:18+05:30 IST
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే...
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇందులో నటించిన సల్లుభాయ్కి ఎంత పేరు వచ్చింది. ఈ మూవీ సల్లుభాయ్తో పాలు ఆయన కలిసి నటించిన పాప హర్షాలీ మల్హోత్రాకి మంచి పేరునే తెచ్చిపెట్టింది.
తాజాగా 13 ఏళ్ల హర్హాలీని మహరాష్ట్ర పభుత్వం భారతరత్న డా బీఆర్ అంబేడ్కర్ అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న ఈ బాల నటి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సంతోషాన్ని పంచుకుంది.
అంతేకాకుండా ఈ అవార్డును నటుడు సల్మాన్ ఖాన్, ఆ మూవీ డైరెక్టర్ కబీర్ ఖాన్, అలాగే నిర్మాతలు, ఇతర చిత్ర బృందం అందరికి డేడికేట్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది.
దీంతో ఈ పోస్ట్ చాలా మంది నెటిజన్లు స్పందించారు. ‘ఇలాగే ఎన్నో విజయాలను చూడాలని కోరుకుంటున్నట్లు’ అని ఒకరు.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఇలాగే ముందుకు వెళ్లు’ అంటూ మరొకరు.. అయితే మరొకరైతే ‘మున్ని ఈ అవార్డు నీది మాత్రమే.. ఎందుకంటే నీ నటనతోనే దీన్ని గెలుచుకున్నావ’ని వరుస కామెంట్స్ పెట్టారు.