సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Madhur Bhandarkar: బార్‌లో పనిచేసే వారి నుంచి బాలీవుడ్ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరికి క్యాసెట్స్ డెలివరీ

ABN, First Publish Date - 2022-10-14T22:34:36+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌లోనే భిన్న‌మైనవాడు మధుర్ బండార్కర్ (Madhur Bhandarkar). రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే సినిమాలకు దర్శకత్వం వహిస్తాడని అతడికి పేరుంది. ‘చాందినీ బార్’ (Chandni Bar)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌లోనే భిన్న‌మైనవాడు మధుర్ బండార్కర్ (Madhur Bhandarkar). రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే సినిమాలకు దర్శకత్వం వహిస్తాడని అతడికి పేరుంది. ‘చాందినీ బార్’ (Chandni Bar), ‘పేజ్-3’ (Page 3), ‘ఫ్యాషన్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఫేమ్ సంపాదించుకున్నాడు. మధుర్ బండార్కర్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. తాను ముంబైలో అనేక రకాల ఉద్యోగాలు చేశానని బండార్కర్ చెప్పాడు.  


కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు తాను అనేక ఉద్యోగాలు చేశానని పేర్కొన్నాడు. ‘‘కొన్ని కారణాల వల్ల మా కుటుంబం పేదరికంలోకి జారుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు డబ్బులు కూడా లేవు. ఫెయిల్ కూడా అయ్యాను. చిన్నతనంలోనే పనులకు వెళ్లడం ప్రారంభించాను. 1983-84లో వీడియో క్యాసెట్స్ మంచి డిమాండ్‌లో ఉన్నాయి. ఈ బిజినెస్ చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. నేను ఒకచోట రూ.10కి క్యాసెట్ కొని, మరో చోట రూ.30కి అమ్మేవాడిని. 1982లో డెలివరీ బాయ్‌గా పనిచేయడం ప్రారంభించాను. సొంత బిజినెస్ మొదలు పెట్టేముందు క్యాసెట్స్‌ను డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నాను. అన్ని రకాల వ్యక్తులకు క్యాసెట్స్‌ను డెలివరీ చేశాను. బార్‌లో పనిచేసే వారి నుంచి బాలీవుడ్ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరికి క్యాసెట్స్‌ను అందించాను. సైకిల్‌పై మొదలైన నా ప్రయాణం స్కూటర్ వరకు చేరుకుంది. డబ్బును బాగానే  సంపాదించాను. సుభాష్ ఘాయ్, రాజ్ సిప్పీ, మిథున్ చక్రవర్తి తదితరులకు క్యాసెట్స్‌ను డెలివరీ చేశాను. మిథున్ చక్రవర్తి నన్ను చూసి చాలా గర్వపడతాడు. క్యాసెట్స్ డెలివరీ చేసిన ఈ అబ్బాయే ఫిల్మ్ మేకర్ అయ్యాడా అని ఆశ్చర్యపోతుంటాడు’’ అని మధుర్ బండార్కర్ తెలిపాడు. అనంతరం తన సోదరితో కలసి దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కూడా అనేక పనులు చేశాడు. కొన్నాళ్లకు ముంబైకి తిరిగివచ్చి బాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్‌గా చేయడం ప్రారంభించాడు. మధుర్ బండార్కర్ తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer) కు దర్శకత్వం వహించాడు. తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేరుగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో విడుదల అయింది.

Updated Date - 2022-10-14T22:34:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!