నా సినిమాకు ఒప్పుకుని.. ముందు Sanju ను స్టార్ట్ చేశాడు.. Ranbir Kapoor పై నాకు చాలా కోపం వచ్చిందంటూ..
ABN , First Publish Date - 2022-06-17T18:35:43+05:30 IST
యువ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తో ‘హే జవానీ హై దివానీ’ అనే సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమయిన దర్శకుడు అయాన్ ముఖర్జీ...

యువ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)తో ‘హే జవానీ హై దివానీ’ అనే సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమయిన దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ డైరెక్టర్‌కి మంచి పేరు వచ్చింది. అనంతరం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ దర్శకుడు తీస్తున్న సినిమా ‘Brahmastra Part One: Shiva’. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ (Alia Bhatt) జంటగా నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ని అందుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో అయాన్ మాట్లాడుతూ.. రణ్‌బీర్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అయాన్ మాట్లాడుతూ.. ‘నేను బ్రహ్మాస్త్ర కోసం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించినప్పుడే.. రణబీర్‌కు సంజు ఆఫర్ వచ్చింది. అతను నాతో జర్నీ చేయాల్సి ఉంది. కానీ అతను మొదట సంజు షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యాడు. నాకు చాలా కోపం వచ్చింది. అతను రాజు హిరానీతో పని చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. అయితే.. నా సినిమా పరిస్థితి ఏంటి?. అందుకే నాకు ఆ కోపం. కానీ.. తర్వాత సంజుని ఎంచుకుని మంచి పనే చేశాడని సంతోషించాను. ఎందుకంటే.. నా సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తికాలేదు. కానీ అప్పటికే.. సంజు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైంది. అంతేకాకుండా.. సూపర్ హిట్ సాధించింది. రణ్‌బీర్ ఈ సినిమా చేయకుండా నాకోసం వెయిట్ చేస్తే.. టైమ్ వేస్టయిపోయేది’ అని చెప్పుకొచ్చాడు.