Brahmastra 2: ‘దేవ్’ పాత్రలో యశ్?.. అయాన్ ముఖర్జీ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-02T18:09:32+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు రణ్‌బీర్ కపూర్, బ్యూటీఫుల్ అలియా భట్ నటించిన సోషీయో ఫాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra)..

Brahmastra 2: ‘దేవ్’ పాత్రలో యశ్?.. అయాన్ ముఖర్జీ రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్ యువ నటుడు రణ్‌బీర్ కపూర్, బ్యూటీఫుల్ అలియా భట్ నటించిన సోషీయో ఫాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్ నిర్మించాడు. మూడు భాగాలుగా రానున్న ఈ సిరీస్‌లోని మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకి పైగా కలెక్షన్లని సొంతం చేసుకుంది. దాంతో.. ఈ మూవీ సెకండ్ పార్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ఈ పార్ట్‌లో దేవ్ (Dev) పాత్ర గురించి రకరకాల ఊహాగానాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.


మొదట ‘దేవ్’ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం రణ్‌వీర్ సింగ్ ఆ పాత్ర చేయబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ‘కేజీఎఫ్’ (KGF) సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ (Yash) ఈ పాత్రలో నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ న్యూస్‌పై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించాడు.


అయాన్ మాట్లాడుతూ.. ‘నాకు యశ్ అంటే చాలా ఇష్టం. అతను దేవ్‌గా నటిస్తే చాలా బాగుంటుంది. నేను జోక్ చేస్తున్నాను. ఆయన నటించట్లేదు. అలాగే రణ్‌వీర్ సింగ్ కూడా ఈ పాత్రలో నటించబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఇతర నటీనటుల గురించి ఇతర పుకార్లు వస్తున్నాయి. కానీ దాని గురించి ఇప్పుడే నేను ఏమీ చెప్పలేను. దేవ్ కథలోని సరదా ఏమిటంటే అది సరైన సమయంలో ప్రేక్షకులకి వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు కరణ్ జోహార్ ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ చిత్రానికి యశ్‌ని పరిశీలిస్తున్నారనే పుకార్లను కొట్టి పారేశాడు. అలాగే.. ‘బ్రహ్మాస్త్ర 2’ దీపికా పదుకొనే కూడా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఈ మూవీ 2025లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

Updated Date - 2022-11-02T18:09:32+05:30 IST