‘బ్రహ్మాస్త్ర’ వివాదంపై స్పందించిన Ayan Mukerji

ABN , First Publish Date - 2022-06-19T22:16:53+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు.

‘బ్రహ్మాస్త్ర’ వివాదంపై స్పందించిన Ayan Mukerji

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్(Karan Johar) భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పాన్ ఇండియాగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను విడుదల చేయనున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేశారు. ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ షూస్ వేసుకుని గుడి లోపలికి ప్రవేశించే సీన్ ఉంది. ఈ సన్నివేశంతో కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా కొందరు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని డిమండ్ చేశారు. తాజాగా ఈ ఉదంతంపై అయాన్ ముఖర్జీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. 


ట్రైలర్‌కు సంబంధించి ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు అభిమానులందరికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) కృతజ్ఞతలు చెప్పారు. ‘‘రణ్‌బీర్ పాత్ర షూస్ వేసుకుని గంటలు కొట్టే సన్నివేశం ట్రైలర్‌లో ఉంది. ఈ షాట్‌తో కొంత మంది మనస్తాపానికి లోనయ్యారు. ఈ సినిమా దర్శకుడిగా, భక్తుడిగా మేం ఏం చిత్రీకరించామో చెప్పాలనుకుంటున్నాను. ‘బ్రహ్మాస్త్ర’ లోని ఆ సీన్‌లో రణ్‌బీర్ షూస్ వేసుకుని దుర్గా పూజ ఆవరణలోకి ప్రవేశించారు. గుడి లోపలికి వెళ్ల‌లేదు. మా కుటుంబం 75ఏళ్లుగా దుర్గాపూజను చేస్తుంది. నా చిన్నతనం నుంచి ఈ పూజలో పాల్గొంటున్నాను. నాకు తెలిసినంత వరకు దేవత ఉన్న ప్రదేశంలోనే షూస్‌ను తీసేస్తాం. ఆవరణలోకి వెళ్లినప్పుడు కాదు. ఆ సీన్‌తో కలత చెందినవారికి వ్యక్తిగతంగా సందేశాన్ని ఇవ్వడం నాకు ముఖ్యం. ఎందుకంటే ‘బ్రహ్మాస్త్ర’ అనేది భారతీయ సాంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రను గౌరవిస్తూ రూపొందించిన సినిమా. అందుకే నా మనసుతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాను’’ అని అయాన్ ముఖర్జీ తెలిపారు. ‘బ్రహ్మాస్త్ర’ లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. 



Updated Date - 2022-06-19T22:16:53+05:30 IST