సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెళ్లి చేసుకొబోతున్న అతియా శెట్టి, కేఎల్.రాహుల్..!

ABN, First Publish Date - 2022-01-22T00:25:05+05:30

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఇల్లు ఈ ఏడాది పలు శుభ కార్యాలకు వేదిక కానుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఇల్లు ఈ ఏడాది పలు శుభ కార్యాలకు వేదిక కానుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, కొడుకు అహాన్ శెట్టి వివాహాలు 2022లో జరుగనున్నట్టు తెలుస్తోంది. అతియా శెట్టి  ‘హీరో’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనంతరం అనేక చిత్రాల్లో నటించినా కూడా ఆశించినంత మేర ఆమెకు సక్సెస్ దక్కలేదు. అతియా గత మూడేళ్లుగా టీమిండియా క్రికెటర్ కేఎల్. రాహుల్‌తో డేటింగ్ చేస్తోందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. తమ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని వారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది కేఎల్.రాహుల్‌ని పెళ్లి చేసుకోవాలని అతియా నిర్ణయించుకుందట. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకారం తెలిపారని సమాచారం. ఆ జంట అధికారికంగా పెళ్లి కబురును త్వరలోనే వినిపిస్తుందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ‘తడప్’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో అతడికి  ఆశించినంత మేర కమర్షియల్ సక్సెస్ లభించలేదు. దీంతో కెరీర్ సంగతి ఎలా ఉన్నా ముందు జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తానియా ష్రాఫ్‌తో 10 ఏళ్లుగా రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్టు అతడు గతంలోనే చెప్పారు. తానియాను 2022లో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అహాన్ ఆలోచిస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే సునీల్ శెట్టి ఇల్లు ఈ ఏడాది అటు కూతురు, ఇటు కొడుకు పెళ్లిల్ల తాలూకూ శుభ కార్యాలతో కళకళలాడనుందని భావించవచ్చు.




Updated Date - 2022-01-22T00:25:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!