సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ananya Panday: ఒకేసారి ఇద్దరిని డేట్ చేసిందా..?

ABN, First Publish Date - 2022-09-23T01:00:17+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan). ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ చాట్ షో ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan). ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ చాట్ షో ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఏడో సీజన్ ప్రారంభమైంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆలియా భట్, రణ్ వీర్ సింగ్, విజయ్ దేవర కొండ, సమంత, కృతి సనన్ వంటి సెలబ్రిటీలెందరో ఈ సీజన్‌‌కు హాజరై సందడి చేశారు. తాజాగా ఈ షోకు గౌరి ఖాన్ (Gauri Khan), మహీప్ కపూర్ (Maheep Kapoor), భావనా పాండే (Bhavana Pandey) హాజరయ్యారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర జవాబులిచ్చారు. షారూఖ్ ఖాన్ భార్య గౌరి ఖాన్ (Gauri Khan) 17ఏళ్ల తర్వాత ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ అరెస్టు గురించి మాట్లాడింది. అనన్య పాండే (Ananya Panday) తల్లి భావనా పాండే తన కూతురి గురించి చెప్పింది. 


కరణ్ జోహార్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా సుహానా ఖాన్‌కు డేటింగ్ సలహా ఏం ఇస్తారని గౌరిని అడిగాడు. అందుకు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చింది. ఒకే టైమ్‌లో ఇద్దరిని డేట్ చేయొద్దని సుహానాకు చెబుతానంది. ఆమె చెప్పిన సమాధానంతో కరణ్ ఫక్కున నవ్వాడు. భావనా పాండే వైపు తిరిగాడు. ‘‘అనన్య ఒకేసారి ఇద్దరిని డేట్ చేసిందని నేను అనుకుంటున్నాను’’ అని కరణ్ రిప్లై ఇచ్చాడు. ‘‘అది నిజం కాదు. ఆమెకు ఈ మధ్యనే ఒకరితో బ్రేకప్ అయింది’’ అని భావనా పాండే పేర్కొంది. అనన్య పాండేతో ఏ నటుడు బెస్ట్‌గా కనిపిస్తాడని కరణ్ మరో ప్రశ్నను అడిగాడు. ‘‘లుక్స్ విషయంలో కార్తిక్ ఆర్యన్‌, నటనలో ఇషాన్‌, డ్యాన్స్‌లో టైగర్ ష్రాఫ్‌, పాడటంలో సిద్దాంత్ చతుర్వేదితో అనన్య బెస్ట్‌గా కనిపిస్తుంద’’ని భావనా పాండే తెలిపింది. అయితే, ఒకరి పేరునే చెప్పమని కరణ్ అడగగా కార్తిక్ ఆర్యన్ అని భావనా పాండే సమాధాన మిచ్చింది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌తో అనన్య కొన్నేళ్లు డేటింగ్ చేసింది. జంటగా అనేక చోట్లకు షికార్లు కొట్టారు. షాహిద్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో కూడా జంటగా ఫోజులకు ఫొజులిచ్చారు.  కొన్ని రోజుల క్రితమే ఈ జంట విడిపోయారని బీ టౌన్ మీడియా తెలిపింది. కానీ, ఈ వదంతులపై అనన్య, ఇషాన్ ఎప్పుడు స్పందించలేదు. 

Updated Date - 2022-09-23T01:00:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!