అదో చెత్త క్యారెక్టర్.. ఆయన కోసమే చేశా : ‘బచ్చన్ పాండే’ నటుడు

ABN , First Publish Date - 2022-03-17T14:42:05+05:30 IST

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రధానపాత్ర పోషించిన ‘మున్నాభాయ్’ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే...

అదో చెత్త క్యారెక్టర్.. ఆయన కోసమే చేశా : ‘బచ్చన్ పాండే’ నటుడు

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రధానపాత్ర పోషించిన ‘మున్నాభాయ్’ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ ద్వారా సంజయ్‌తోపాటు అందులో సర్య్కూట్ పాత్ర పోషించిన అర్షద్ వర్షికి సైతం ఎంతో క్రేజ్‌ వచ్చింది. ఈ నటుడు తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ‘బచ్చన్ పాండే’లో సైతం ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సర్య్కూట్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


అర్షద్ మాట్లాడుతూ.. ‘ మున్నాభాయ్‌లోని సర్క్యూట్ ఓ చెత్త క్యారెక్టర్. అందుకే అందులో ప్రధాన పాత్ర ఎవరూ చేస్తున్నారో తెలుసుకుని మరి ఒప్పుకున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే.. సంజయ్ దత్ కోసమే ఈ క్యారెక్టర్‌ని చేశాను. నిజానికి కథ రాసినప్పుడు ఆ పాత్రకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఆ విషయం నాకే కాదు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ హీరానికి కూడా తెలుసు. నిజం చెప్పాలంటే.. నాకంటే ముందు ఈ పాత్రని మకరంద్ దేశ్‌పాండే‌కి ఆఫర్ చేయగా.. ఆయన రిజెక్ట్ చేశాడు. అయితే నా వరకు ప్రేక్షకులకి నచ్చుతుందని అనుకుంటే ఏ జోనర్ పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే’ అని చెప్పుకొచ్చాడు.


అయితే.. బచ్చన్ పాండే‌లో అర్షద్ చేయబోతున్న క్యారెక్టర్ కోసం ఎంతోమంది ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ అలాంటిది. కాగా.. అక్షయ్ కుమార్, అర్షద్ వర్షి కలిసి ఇంతకుముందు జానీ దుష్మాన్‌లో నటించగా.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇందులో కలిసి నటిస్తున్నారు.

Updated Date - 2022-03-17T14:42:05+05:30 IST

Read more