సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్‌లెస్‌గా యంగ్ హీరో.. గర్ల్‌ఫ్రెండ్‌ని టీజ్ చేస్తూ..

ABN, First Publish Date - 2022-03-09T17:17:46+05:30

బాలీవుడ్‌లోని క్రేజీ లవ్‌బర్డ్స్‌లో అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట ఒకటి. వారి వయస్సు తేడా గురించి బహిరంగంగానే మాట్లాడే ఈ కపుల్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని క్రేజీ లవ్‌బర్డ్స్‌లో అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట ఒకటి. వారి వయస్సు తేడా గురించి బహిరంగంగానే మాట్లాడే ఈ కపుల్.. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరి ప్రేమని వ్యక్తపరుస్తూనే ఉంటారు. తాజాగా అర్జున్ తన గర్ల్‌ఫ్రెండ్‌‌ మలైకాని సోషల్ మీడియాలో సరదాగా టీజ్ చేశాడు.


అర్జున్ కపూర్ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేశాడు. అందులో షర్ట్‌లెస్‌గా ఉన్న ఈ యంగ్ హీరో బ్యాక్ మాత్రమే కనిపిస్తోంది. ఆ పిక్.. ‘మలైకా చివరికి నా బ్యాక్ చూడగలిగావు’ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అయితే.. ఇటీవలే మలైకా తన ఇంట్లో అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ పిక్‌లోని రూమ్‌లో ఓ మూలగా ఉన్న ఫొటోలో ఇద్దరు కలసి దిగిన ఫొటో ఉన్న విషయాన్ని గమనించిన నెటిజనులు కామెంట్స్ కూడా చేశారు.

Updated Date - 2022-03-09T17:17:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!