Arjun Kapoor: మలైకపై వార్తలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్ కపూర్

ABN , First Publish Date - 2022-12-01T21:18:51+05:30 IST

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) కొంత కాలంగా మలైకా అరోరా (Malaika Arora) తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Arjun Kapoor: మలైకపై వార్తలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్ కపూర్

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) కొంత కాలంగా మలైకా అరోరా (Malaika Arora) తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలైక ప్రెగ్నెంట్ అని కొంతకాలంగా నెట్టింట రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. పలు వెబ్‌సైట్స్ కూడా కథనాలను వండివార్చాయి. ఈ జంట అభిమానులందరు కూడా వదంతులను నిజమని నమ్మడం మొదలుపెట్టారు. ఈ రూమర్స్‌పై అర్జున్ కపూర్ తాజాగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆమె ప్రెగ్నెంట్ అని ఇంగ్లిష్ వెబ్‌సైట్ రాసిన కథనంపై మండిపడ్డాడు. అందుకు సంబంధించిన ఆర్టికల్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు.     


‘‘చెత్త వార్తలను రాయడంలో మీరు దిగజారారు. ఈ జర్నలిస్ట్ క్రమం తప్పకుండా ఇటువంటి వార్తలనే రాస్తున్నారు. అవి రూమర్స్ అని మేం పట్టించుకోవడం లేదు. కానీ, ఈ వదంతులే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి అందరూ వాటిని నిజాలే అని నమ్ముతున్నారు. ఇకనైనా ఇలాంటివి రాయడం మానుకోండి. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దు’’ అని అర్జున్‌ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌ను మలైక రీ షేర్ చేసింది. అర్బాజ్ ఖాన్‌తో మలైకా అరోరా 2017లో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆమెకు అర్జున్ కపూర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో నాలుగేళ్ల నుంచి ఈ జంట డేటింగ్ చేస్తున్నారు. గతేడాది తాము ప్రేమించుకుంటున్నామని బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం మలైకా అరోరా, అర్జున్ కపూర్ కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అందువల్ల ఈ జంట పెళ్లి చేసుకోవడం లేదు. మలైక త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. రియాలిటీ షోను హోస్ట్ చేస్తుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఈ సిరీస్‌లో వెల్లడిస్తానని అందాల భామ చెప్పింది.     


Updated Date - 2022-12-01T21:18:51+05:30 IST

Read more