సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘గెట్-స్వెట్ గో’ అంటున్న అనుష్క శర్మ

ABN, First Publish Date - 2022-03-12T02:22:37+05:30

అనుష్క శర్మ కొంత కాలం క్రితమే సినిమాలకు బైబై చెప్పేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుష్క శర్మ కొంత కాలం క్రితమే సినిమాలకు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్నాక చిత్రాలకు  విరామం ప్రకటించింది. మూడేళ్ల అనంతరం తిరిగి ఆమె మూవీస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో ఆమె నటించనుంది. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీలో ఝులన్ పాత్రలోనే ఆమె కనిపించనుంది. ఈ చిత్రం కోసం అనుష్క గత కొన్ని రోజులుగా మైదానంలో చెమటోడోస్తుంది. క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కింద ‘‘గెట్ స్వెట్ గో’’ అని క్యాప్షన్ ఇచ్చింది. 


కాగా, ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ చిత్రంలోని ఝులన్ పాత్రకు వీలైనంత ఎక్కువ న్యాయం చేకూర్చాలని అనుష్క భావిస్తోందట. అందుకోసం కోచ్ పర్యవేక్షణలో క్రికెట్‌ను ప్రాక్టీస్ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 6న ‘ఛక్ దా ఎక్స్ ప్రెస్’ టీజర్‌ను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. టీజర్‌లోని ఆమె లుక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. విరాట్ భార్య కావడం వల్లే ఈ చిత్రంలో ఆమెకు అవకాశం దక్కిందని మరికొందరు విమర్శించారు.





Updated Date - 2022-03-12T02:22:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!