సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chakda Xpress మొదటి షెడ్యూల్ పూర్తయిందంటున్న Anushka Sharma

ABN, First Publish Date - 2022-07-04T01:37:13+05:30

విరాట్ కోహ్లీ(Virat Kohli)ని పెళ్లి చేసుకున్నాక అనుష్క శర్మ(Anushka Sharma) సినిమాలకు బై బై చెప్పేసింది. కొంతకాలం చిత్రాలకు విరామం ప్రకటించింది. చివరగా ‘జీరో’ సినిమాలో కనిపించింది. ఆనంద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విరాట్ కోహ్లీ(Virat Kohli)ని పెళ్లి చేసుకున్నాక అనుష్క శర్మ(Anushka Sharma) సినిమాలకు బై బై చెప్పేసింది. కొంతకాలం చిత్రాలకు విరామం ప్రకటించింది. చివరగా ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కించిన ‘జీరో’ సినిమాలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీకి తిరిగి ఎంట్రీ ఇస్తుంది. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ (Chakda Xpress) చిత్రంలో నటిస్తుంది. ఝులన్ గోస్వామి (Jhulan Goswami) జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఝులన్ పాత్రలో ఆమె కనిపించనుంది. అనుష్క ఈ సినిమా కోసం కోచ్ పర్యవేక్షణలో క్రికెట్‌ ట్రైనింగ్ తీసుకుంది. మైదానంలో చెమటోడ్చింది. ఈ మూవీ షూటింగ్‌ను కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టారు. తాజాగా ఓ షెడ్యూల్ పూర్తయినట్టు సోషల్ మీడియా వేదికగా అనుష్క శర్మ తెలిపింది. 


అనుష్క శర్మ క్రికెట్ బాల్ ఫొటోను జులై 2న అభిమానులతో పంచుకుంది. ‘‘మొదటి షెడ్యూల్ పూర్తయింది’’ అని ఆమె చెప్పింది. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ కు ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్లీన్ స్లేట్ ఫిల్మ్‌జ్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జనవరి 6న అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని ఆమె పేర్కొంది. ‘‘ఝులన్ గోస్వామి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి చేరుకుంది. ఒక మహిళ స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. భారత్‌లో కొంత మంది స్త్రీలు మాత్రమే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఝులన్ జీవితంలోని ఎన్నో ఎత్తుపల్లాలను ఈ సినిమా చూపిస్తుంది. ఆమె కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మహిళల క్రికెట్‌లోని స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేసింది. ఈ మూవీ మహిళల క్రికెట్‌ను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఝులన్ పాత్రను పోషిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది ’’ అని అనుష్క శర్మ వివరించింది.



Updated Date - 2022-07-04T01:37:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!