విరాట్ కోహ్లీతో కలసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న Anushka Sharma
ABN , First Publish Date - 2022-06-13T00:47:56+05:30 IST
అనుష్క శర్మ(Anushka Sharma) కొంత కాలం క్రితమే సినిమాలకు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(Virat Kohli) ని పెళ్లి చేసుకున్నాక చిత్రాలకు విరామం ప్రకటించింది. షారూఖ్ హీరోగా
అనుష్క శర్మ(Anushka Sharma) కొంత కాలం క్రితమే సినిమాలకు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(Virat Kohli) ని పెళ్లి చేసుకున్నాక చిత్రాలకు విరామం ప్రకటించింది. షారూఖ్ హీరోగా నటించిన ‘జీరో’ అనంతరం ఏ సినిమా కూడా చేయలేదు. మూడేళ్ల అనంతరం తిరిగి ఆమె మూవీస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అందుకు సంబంధించిన ట్రైనింగ్‌ను కూడా మొదలుపెట్టింది. కొంచెం ఖాళీ సమయం దొరకడంతో తన భర్త విరాట్, కుమార్తె వామికా(Vamika) తో కలసి సరదాగా వెకేషన్( vacation) ను ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్‌లో ఆమె టోపీ ధరించి కనిపించింది. బీచ్‌లో కెమెరాను సెట్ చేసి ఫోజులిచ్చింది. ‘‘మీ సొంతంగా ఫొటోలను తీసుకుంటే ఇదే ఫలితం’’ అని అనుష్క ఆ పిక్స్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
హాలీడేకు వెళ్లడానికి ముందుగా అనుష్క శర్మ మైదానంలో ఎక్కువగా చెమటోడుస్తుంది. అందుకు కారణమేంటంటే ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ (Chakda Xpress)లో ఆమె నటిస్తుంది. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఝులన్ పాత్రలోనే ఆమె కనిపించనుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ కు ప్రొసిత్ రాయ్ (Prosit Roy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.