బాలీవుడ్ సీనియర్ నటుడి కాళ్లు తాకబోయిన Karan Johar.. Anil Kapoor రియాక్షన్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-05-23T13:55:36+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, కియారా అడ్వాణీ, వరుణ్ ధావన్, నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం జగ్ జగ్ జీయో...

బాలీవుడ్ సీనియర్ నటుడి కాళ్లు తాకబోయిన Karan Johar.. Anil Kapoor రియాక్షన్‌కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, కియారా అడ్వాణీ, వరుణ్ ధావన్, నీతూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం జగ్ జగ్ జీయో. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌‌ని మూవీ టీం తాజాగా విడుదల చేసింది. ఆ కార్యక్రమానికి కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అందులో.. కరణ్ బాలీవుడ్ సినీయర్ నటుడు అనిల్‌ కపూర్‌ని స్టేజ్ మీదకి ఆహ్వానించాడు. ఆయన పైకి వస్తున్న క్రమంలో అనిల్ కాళ్లని తాకడానికి కరణ్ ప్రయత్నించాడు. ఇది గమనించిన అనిల్ ఎగిరి పక్కకి దూకేశాడు. అంతేకాకుండా కాళ్లు తాకొద్దు అన్నట్లు సైగ చేశాడు. అనంతరం కరణ్, అనిల్ కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన పలువురు నెటిజన్లు ఫిదా అయ్యి కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ‘ఫన్నీ మ్యాన్’, ‘ఈ వయసులోని ఎంతో యంగ్ యాటిట్యూడ్‌తో ఉంటారు. అందుకే అనిల్ అంటే మాకు లవ్’ అంటూ కామెంట్స్ పెట్టారు.Updated Date - 2022-05-23T13:55:36+05:30 IST

Read more