Anees Bazmee: యాక్షన్ కామెడీలో వరుణ్ ధావన్

ABN , First Publish Date - 2022-11-30T01:14:21+05:30 IST

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan)

Anees Bazmee: యాక్షన్ కామెడీలో వరుణ్ ధావన్

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan). బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనీస్ బజ్మీ (Anees Bazmee)తో కలసి వరుణ్ పనిచేయనున్నాడని బీ టౌన్ మీడియా తెలుపుతుంది. కొన్ని నెలలుగా వీరిద్దరు ప్రాజెక్టు గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. అనీస్ ఓ లైన్‌ను వినిపించగా అది వరుణ్‌కు బాగా నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించాలని హీరో కోరినట్టు తెలుస్తోంది. 

    

అనీస్ చెప్పిన ఐడియా సరికొత్తగా ఉండటంతో వరుణ్ ధావన్ ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ కామెడీగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాదిలో  పట్టాలెక్కే అవకాశం ఉంది. వరుణ్ ధావన్, అనీస్ బజ్మీ కలసి పని చేయడం ఇదే తొలిసారి. జీ స్టూడియోస్, ఎచెలాన్ ప్రొడక్షన్స్‌కు చెందిన విశాల్ రాణా ఈ సినిమాను రూపొందించనున్నారు. హార్రర్ కామెడీ, ఫ్యామిలీ కామెడీ జోనర్స్‌లో అనీస్ పలు చిత్రాలను తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద హిట్స్ కొట్టాడు. అందువల్ల కామెడీ‌లోనే కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని అనీస్ భావిస్తున్నాడట. ప్రేక్షకులందరికి సరికొత్త అనుభూతిని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. అనీస్ బజ్మీ చివరగా ‘భూల్ భూలయ్య 2’ కి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరిని పోసింది. ఈ హిట్ ఇచ్చిన జోష్‌తో యంగ్ హీరోలకు అనీస్ కథలు వినిపిస్తున్నాడు. ఇప్పటికే షాహిద్ కపూర్ ఒకే చెప్పాడు. షాహిద్ సినిమా పూర్తయిన తర్వాత వరుణ్ ధావన్ ప్రాజెక్టును అనీస్ పట్టాలెక్కించనున్నాడు.  

Updated Date - 2022-11-30T01:14:21+05:30 IST

Read more