సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rashtra Kavach Om నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదల

ABN, First Publish Date - 2022-06-27T01:48:36+05:30

టీవీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వ్యక్తి ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur). ‘లండన్ డ్రీమ్స్’ సినిమాతో బీ టౌన్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చారు. ‘ఆషీకీ-2’ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీవీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా మారిన వ్యక్తి ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur). ‘లండన్ డ్రీమ్స్’ సినిమాతో బీ టౌన్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చారు. ‘ఆషీకీ-2’ చిత్రంతో భారీ హిట్ కొట్టారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘రాష్ట్ర కవచ్ ఓమ్’ (Rashtra Kavach Om). సంజన సంఘీ (Sanjana Sanghi) హీరోయిన్‌గా నటించారు. కపిల్ వర్మ దర్వకత్వం వహించారు. ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా నుంచి కొత్త పాటను విడుదల చేసింది.


మేకర్స్ సినిమాలోని ‘సెహర్’(Seher) అనే పాటను జూన్ 26న రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను అర్జిత్ సింగ్ అలపించారు. లిరిక్స్‌ను ఏఎమ్. తురాజ్ రాశారు. ఆర్కో సంగీతం అందించారు. ఈ పాట ఎమోషనల్‌గా సాగింది. హీరో, హీరోయిన్‌ల మధ్య సన్నివేశాలను హృద్యంగా ఆవిష్కరించారు. మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రకాష్ రాజ్ కూడా కనిపించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆదిత్య రాయ్ కపూర్, సంజన సంఘీ మొదటిసారిగా కలసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఓమ్: ద బ్యాటిల్ వితిన్’ అని గతంలో టైటిల్ పెట్టారు. ఏమైందో తెలియదు కానీ మేకర్స్ ప్రస్తుతం ఆ టైటిల్‌ను ‘రాష్ట్ర కవచ్ ఓమ్’ గా మార్చారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, ఆశుతోష్ రాణా, విక్రమ్ కొచ్చర్, విక్కీ అరోరా కీలక పాత్రలు పోషించారు. ‘ఏ పేపర్ డాల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌’ తో కలసి ‘జీ స్టూడియోస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.



Updated Date - 2022-06-27T01:48:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!