సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రెండోసారి కొవిడ్ పాజిటివ్

ABN, First Publish Date - 2022-08-24T12:44:55+05:30

బాలీవుడ్ మెగాస్టార్(Bollywood megastar) అమితాబ్ బచ్చన్‌కు(Amitabh Bachchan) రెండోసారి( second time) కరోనా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్(Bollywood megastar) అమితాబ్ బచ్చన్‌కు(Amitabh Bachchan) రెండోసారి( second time) కరోనా (Covid positive) సోకింది. తాను చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్(CoViD + positive) అని తేలిందని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ సూచించారు. కరోనా బారిన పడిన బిగ్ బి(Big B) సోనీ టీవీ ప్రసారం చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి(Kaun Banega Crorepati) షూటింగులో పాల్గొనాల్సి ఉండగా రెండోసారి కరోనా సోకింది. 


‘‘ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. నాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’అంటూ అమితాబ్ బచ్చన్ మంగళవారం రాత్రి 11.25 గంటలకు ట్వీట్ చేశారు. అమితాబ్‌కు 2020 జులై నెలలో కరోనా సోకడంతో అతన్ని ముంబయిలోని (Mumbai)నానావతి ఆసుపత్రికి తరలించారు. రెండు వారాల పాటు అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా సోకింది. అమితాబ్ అజయ్ దేవగన్ సినిమా రన్ వే 34(Runway 34)లో చివరిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించారు.


Updated Date - 2022-08-24T12:44:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!