Allu Arjun: Pushpa సినిమాలో ఆ ఒక్క సీన్ గురించి Amitabh Bachchan కు డౌట్.. సుకుమార్‌ను పిలిచి మరీ అడిగితే..
ABN , First Publish Date - 2022-08-13T21:26:01+05:30 IST
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోను రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రంతో బన్నీ ఉత్తరాది వారికీ
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోను రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రంతో బన్నీ ఉత్తరాది వారికీ కూడా చేరువయ్యాడు. ఈ మూవీలోని పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ‘పుష్ప’ లో శ్రీ వల్లీ పాటలో బన్నీ చెప్పులతో వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ హుక్ స్టెప్‌కు సంబంధించిన రహస్యాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.
అమితాబ్ కథలను అద్భుతంగా చెబుతాడని అందరికి తెలిసిందే. అతడు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-14’ కు (Kaun Banega Crorepati) హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలోని ఓ ఎపిసోడ్లో హుక్ స్టెప్‌కు సంబంధించిన రహస్యాన్ని పంచుకున్నాడు. షోలో పాల్గొంటున్న ఓ కంటెస్టెంట్ ‘పుష్ప’ ప్రస్తావనను తీసుకురావడంతో ఆ స్టెప్ వెనకున్న కథను చెప్పాడు. ‘పుష్ప’ ను చూసినప్పుడు శ్రీ వల్లీ పాటలో అల్లు అర్జున్ చెప్పులతో వేసిన స్టెప్ చూడగానే నాకు ఆసక్తి కలిగిందని బిగ్ బీ చెప్పాడు. ఆ స్టెప్‌ను కావాలనే కొరియోగ్రఫీ చేశారా లేదా ఏమయినా తప్పు జరిగిందా అనేది తెలుసుకోవాలనిపించిందని పేర్కొన్నాడు. తాను హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడైన సుకుమార్‌ను ఈ స్టెప్ గురించి అడిగానన్నాడు. అందుకు సుకుమార్ సమాధానమిస్తూ.. ‘‘అల్లు అర్జున్ డ్యాన్స్ చేసినప్పుడు చెప్పు జారిపోయింది. అదే స్టెప్‌గా మారింది’’ అని బిగ్ బీకీ చెప్పాడు. అనంతరం ఆ డ్యాన్స్ మూవ్ దక్షిణాది ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్‌గా మారిపోయి చరిత్రను సృష్టించింది. ఇక అమితాబ్ బచ్చన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌ను పూర్తి చేశాడు. ‘గుడ్ బై’, ‘గణపత్’, ‘ప్రాజెక్ట్-కె’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.