Amitabh Bachchan: బిగ్‌బీ కోసం సెక్యూరిటీని దాటుకొచ్చిన బాలుడు.. మెగాస్టార్ కాళ్లపై పడి..
ABN , First Publish Date - 2022-11-22T17:35:03+05:30 IST
జుహూ (Juhu)లోని తన ఇళ్లు ‘జల్సా’ బయట ప్రతి ఆదివారం తన అభిమానులను కలుసుకోవడం, పలకరించడం అమితాబ్ బచ్చన్..

జుహూ (Juhu)లోని తన ఇళ్లు ‘జల్సా’ బయట ప్రతి ఆదివారం తన అభిమానులను కలుసుకోవడం, పలకరించడం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)కి అలవాటు. దాన్ని అనుసరిస్తూ ఈ వారం కూడా బిగ్‌బీ తన ఇంటి బయట ఫ్యాన్స్‌ని కలిశాడు. ఈ సందర్భంగా ఆయన్ని చూడటానికి వందల మంది అభిమానులు వచ్చారు. అందులో ఓ బాలుడు అక్కడి బారీకేడ్లని దూకి.. సెక్యూరిటీని దాటుకుని బిగ్‌బీ దగ్గరకి వచ్చాడు. అంతేకాకుండా.. అమితాబ్ కాళ్లపైన పడిపోయాడు. దీనికి గురించి తాజాగా ఆయన బ్లాక్‌లో రాసుకొచ్చాడు అమితాబ్ బచ్చన్.
అమితాబ్ రాసిన బ్లాక్‌లో.. ‘ఈ బాలుడు ఇండోర్ నుంచి వచ్చాడు. అతను 4 సంవత్సరాల వయస్సులో డాన్‌ను చూశాడు. ఇప్పటికి అదే ఆలోచనలో ఉన్నాడు.. ఆ సినిమాలోని నా డైలాగులని వరుసగా చెప్పాడు. చాలా కాలం తర్వాత తన కోరికను తీర్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాదాల మీద పడిపోయాడు. అది నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతన్ని ఓదార్చి, అతను వేసిన నా పెయింటింగ్ మీద ఆటో గ్రాఫ్ చేశాను. అలాగే అతని తండ్రి రాసిన లెటర్‌న చదివాను. శ్రేయోభిలాషుల భావోద్వేగం అలానే ఉంటుంది’ అని రాసుకొచ్చారు. అలాగే దానికి సంబంధించిన పిక్స్‌ని కూడా బ్లాగ్‌లో పంచుకున్నాడు.


