Adipurush OTT Rights: విడుదలకు ముందే సెన్సేషన్.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ ఎంత పెట్టి కొనుగోలు చేసిందంటే..

ABN , First Publish Date - 2022-08-23T20:21:27+05:30 IST

కోవిడ్ తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఆదరణ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పూర్తైన సినిమా థియేటర్స్ ఓపెన్..

Adipurush OTT Rights: విడుదలకు ముందే సెన్సేషన్.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ ఎంత పెట్టి కొనుగోలు చేసిందంటే..

కోవిడ్ తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఆదరణ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పూర్తైన సినిమా థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ వాటి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అందుకే సినిమాల బాక్సాఫీస్ విడుదల తర్వాత డిజిటల్ విడుదల కోసం చిత్ర నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను సంప్రదిస్తున్నారు. అందులో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ (amazon prime) సినిమా వల్ల ఉపయోగం ఉందనుకుంటే ఎన్ని కోట్లయిన ఖర్చు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.


ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ నటుడు ప్రభాస్ (prabhas). ఆ తర్వాత ఆయన చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అయితే.. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ అంతగా ఆకట్టుకోలేదు. అయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్(Adipurush)’. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ మూవీ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ తరుణంలో ‘ఆదిపురుష్’ ఓటీటీ రైట్స్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది.


ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ క్రేజీ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందట. దానికోసం రూ.250 కోట్ల భారీ మొత్తం చెల్లించిందంట. ఈ న్యూస్ గురించి ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. విడుదల కాకాముందే.. ఓటీటీ రైట్స్‌ని అంతా భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్‌ సొంతం చేసుకోవడం ప్రభాస్ క్రేజ్‌ని చూపిస్తుందని అనుకుంటున్నారు. విడుదలకి ముందే ఇంత భారీ డీల్‌ని కుదుర్చుకున్న ఈ చిత్రం రీలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందోనని చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-08-23T20:21:27+05:30 IST