సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పాకిస్తాన్, ఆస్ట్రేలియాలో నంబర్ 1 మూవీగా Gangubai Kathiawadi

ABN, First Publish Date - 2022-04-30T01:25:56+05:30

ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. భన్సాలీ ప్రొడక్షన్స్‌తో కలసి జయంతిలాల్ గడా ఈ మూవీని సంయుక్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. భన్సాలీ ప్రొడక్షన్స్‌తో కలసి జయంతిలాల్ గడా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాడు. అజయ్ దేవగణ్, జిమ్ సర్భ్, శంతను మహేశ్వరి, విజయ్ రాజ్, సీమా భార్గవ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. 


‘గంగూబాయి కతియావాడి’ని థియేటర్స్‌లో మిస్ అయిన వారు ఓటీటీ ప్లాట్‌ఫాంలో చూస్తున్నారు. దీంతో ఈ చిత్రం కొన్ని దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అరబ్ ఎమిరేట్స్‌తో సహా మరో 10 దేశాల్లో ఈ చిత్రం నంబర్ 1 స్థానంలో ఉంది. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ‘గంగూబాయి కతియావాడి’ ని రూపొందించారు. ఈ చిత్రంలో ఆలియా నటనకు అభిమానుల మన్ననలతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. 



Updated Date - 2022-04-30T01:25:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!