Alia Bhattపై విమర్శలు చేస్తున్న నెటిజన్లు.. కారణం ఆ యాడ్స్‌లో నటించడమే..
ABN, First Publish Date - 2022-05-09T18:48:32+05:30
‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన నటి అలియా భట్...
‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన నటి అలియా భట్ (Alia Bhatt). వరుసగా మంచి సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్లింది. ఇటీవలే రాజమౌళి పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ విషయమై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురవుతోంది.
అలియాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. అలియా ‘కలంక్’ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదిత్యా రాయ్ కపూర్, వరుణ్ ధావన్‌తో కలిసి ‘ది కపిల్ శర్మ షో (The Kapil Sharma Show)’లో గెస్ట్‌గా పాల్గొంది. ఆ సమయంలో అక్కడ చక్కెర కలిపిన డ్రింక్ ఇచ్చారు. అది టేస్ట్ చేసిన అలియా చక్కెరనేను తాగను అని రిజెక్ట్ చేసింది. అంతేకాకుండా చక్కెర మంచి కాదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మరో వీడియో అలియా నటించిన యాడ్స్‌కి సంబంధించింది. అందులో దాదాపు అన్ని చక్కెర కలిగి ఉన్న ప్రొడక్ట్సే. దీంతో ఈ రెండింటిని పోలుస్తూ.. అలియా షుగర్ తీసుకోదు. కానీ డబ్బు కోసం షుగర్ కలిపిన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. డబ్బు కోసం తాను వాడని ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.