సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

త్వరలో ఓటీటీలోకి రానున్న gangubai kathiawadi.. ఎప్పుడు.. ఎక్కడంటే..

ABN, First Publish Date - 2022-04-20T17:50:50+05:30

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో అలియా భట్ ఒకరు. ఈ భామ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో అలియా భట్ ఒకరు. ఈ భామ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దక్షిణాది భాషల్లో సైతం మంచి గుర్తింపు సాధించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగుభాయి కతియావాడి’. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే థియేటర్స్‌‌లో విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.


ప్రముఖ రచయిత ఎస్ హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 25న విడుదలైంది. విడుదల తర్వాత మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. ఆ ట్వీట్‌లో.. ‘మీకు నచ్చిన గంగుభాయి కతియావాడి ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. తప్పకుండా చూడండి’ అంటూ రాసుకొచ్చింది.



Updated Date - 2022-04-20T17:50:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!