Alia Bhatt: అలాంటి వాటిని చదవనంటున్న ఆలియా.. వాటి గురించి చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారంటూ..

ABN , First Publish Date - 2022-09-24T18:28:06+05:30 IST

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో అలియా భట్ ఒకరు. ఈ బ్యూటీ అందానికే కాదు అభినయానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

Alia Bhatt: అలాంటి వాటిని చదవనంటున్న ఆలియా.. వాటి గురించి చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారంటూ..

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో అలియా భట్ (Alia Bhatt) ఒకరు. ఈ బ్యూటీ అందానికే కాదు అభినయానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ బ్యూటీ ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌(Ranbir Kapoor)ని పెళ్లి చేసుకోగా.. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఈ జంట మొదటిసారి కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై వచ్చే రివ్యూల గురించి ఈ బ్యూటీ మాట్లాడింది.


ఆలియా మాట్లాడుతూ.. ‘నేను సమీక్షలను చదవను. సమీక్షలు నాకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటిని చదవను. నన్ను విమర్శించేలా ఉన్నా వాటిని చదవను. అయితే.. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు పంపే ఆర్టికల్స్‌లోని ముఖ్యాంశాలను మాత్రమే చదువుతాను. మొదటి చిత్రం నుంచి నాకు ఓ ఆలోచన వస్తుంటుంది. సినిమా విడుదలైన తర్వాత ఏది బావుందో, ఏది బాలేదో మీకు సాధారణంగానే అవగాహన వచ్చేస్తుంది. అందుకే అలాంటి రివ్యూలని చూసి ఏం ఉపయోగం’ అని చెప్పుకొచ్చింది. ఆలియా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు చాలామంది వ్యక్తులను ఫీడ్‌బ్యాక్ కోసం అడుగుతాను.అది మొదటి రోజైన, పదో రోజైన సినిమా గురించి నెగటివ్‌గా ఆలోచించడం నచ్చదు. అందుకే రివ్యూలను చదవను’ అని తెలిపింది.


కాగా..శివగా రణబీర్ కపూర్, ఇషాగా అలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ సెప్టెంబర్ 9న విడుదలైంది. ఆ మూవీకి సరైన టాక్ లేనప్పటికీ.. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ టూ: దేవ్’ గురించి అయాన్ ముఖర్జీ తాజాగా ఎనౌన్స్ చేశాడు. ఈ సీక్వెల్‌లో శివ తల్లిదండ్రులు దేవ్, అమృత పాత్రలను ఎవరు పోషిస్తారనే దానిపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే.. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఇతిహాసంలో రణ్‌బీర్ తల్లిగా కనిపించింది దీపికా పదుకొణె అని అందరూ అనుకుంటున్నారు. అయితే.. మేకర్స్ మాత్రం రెండు పాత్రల గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ.. దేవ్‌గా రణ్‌వీర్ సింగ్, అమృతగా దీపికా పదుకొనే నటించే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. ఆలియా కూడా అమృత క్యారెక్టర్‌లో దీపిక అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-09-24T18:28:06+05:30 IST

Read more