తన ‘బాతు’ నడక గురించి చెబుతూ ‘పుష్పరాజ్’ని గుర్తు చేసుకున్న ‘గంగూబాయి’!

ABN , First Publish Date - 2022-04-03T22:05:58+05:30 IST

ఆలియా భట్ తన సక్సెస్ ఫుల్ మూవీ ‘గంగూబాయ్ కతియావాడి’ గురించి మరోసారి మాట్లాడింది. ‘గంగూబాయ్’ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తోనూ ప్రేక్షకుల్ని అలరించిన ఆలియా నెక్ట్స్ ‘బ్రహ్మాస్త్ర’తో బాక్సాఫీస్ వద్దకు రానుంది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ‘గంగూబాయ్’ పాత్ర గురించి, మరీ ముఖ్యంగా, ఆమె నడక గురించి ఆలియా చెప్పుకొచ్చింది...

తన ‘బాతు’ నడక గురించి చెబుతూ ‘పుష్పరాజ్’ని గుర్తు చేసుకున్న ‘గంగూబాయి’!

ఆలియా భట్ తన సక్సెస్ ఫుల్ మూవీ ‘గంగూబాయ్ కతియావాడి’ గురించి మరోసారి మాట్లాడింది. ‘గంగూబాయ్’ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తోనూ ప్రేక్షకుల్ని అలరించిన ఆలియా నెక్ట్స్ ‘బ్రహ్మాస్త్ర’తో బాక్సాఫీస్ వద్దకు రానుంది. ప్రియుడు రణబీర్‌తో కలసి మొదటిసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ఆమె ప్రస్తుతం దర్శకుడు అయాన్ ముఖర్జీ సూపర్ హీరో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ‘గంగూబాయ్’ పాత్ర గురించి, మరీ ముఖ్యంగా, ఆమె నడక గురించి ఆలియా చెప్పుకొచ్చింది...


‘గంగూబాయ్’ నడక తీరు చాలా ప్రత్యేకం అంటోంది ఆలియా. సాధారణంగా తన నిజ జీవిత నడక విచిత్రంగా ఉంటుందని చెప్పిన ఆమె... ‘‘నేను ‘బాతు’ లాగా నడుస్తా’’నని నవ్వుతూ చెప్పింది. అయితే తన రొటీన్ ‘డక్ వాక్’ ‘గంగూబాయ్’ కోసం మార్చుకున్నానని ఆలియా అంటోంది. గంగూబాయ్‌గా తన నడకలో ‘స్వాగ్’ ఉండాలనీ, చూసేవారికి ఇంట్రస్టింగ్‌గా అనిపించాలని భావించిందట. అందుకే, తన నడకని, నడతని చాలా మార్చుకుందట. అయితే, ఈ ముచ్చట్లు చెబుతూనే ఆలియా భట్ మన అల్లు అర్జున్‌ని కూడా గుర్తు చేసుకుంది... 


‘గంగూబాయ్’ గురించి మాట్లాడుతూ ‘పుష్ప’ సినిమా ప్రస్తావన తెచ్చిన ఆలియా... అల్లు అర్జున్‌లోని ‘స్వాగ్’ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. చూసేవార్ని కట్టిపడేసే ఆకర్షణ బన్నీలో సహజంగా ఉందంటూ పొగడ్తలు కురిపించింది. దాన్నే ఆమె ‘స్వాగ్’ అంటూ... అది ‘పుష్పరాజ్’లో బోలెడంత ఉందని చెప్పింది! చూడాలి మరి, ఇప్పటికే మెగాపవర్ స్టార్‌తో జోడీ కట్టిన బీ-టౌన్ బ్యూటీ ముందు ముందు ఐకాన్ స్టార్‌తో కూడా ఆడిపాడుతుందేమో...   

Updated Date - 2022-04-03T22:05:58+05:30 IST

Read more