సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranbir Kapoor-Alia Bhatt పెళ్లిపై ఓ అభిమాని వీడియో.. స్పందించిన అలియా.. ఇంతకీ అందులో ఏముందంటే..

ABN, First Publish Date - 2022-04-11T19:47:49+05:30

బాలీవుడ్ లవ్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ లవ్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి వెడ్డింగ్ గురించి గత రెండేళ్లుగా న్యూస్ వస్తున్నప్పటికీ అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా మరోసారి వారి పెళ్లి ఏప్రిల్ 13 నుంచి 17 మధ్య జరగనున్నట్లు ఆర్‌కే స్టూడియోలో గ్రాండ్‌గా జరగనున్నట్లు తేది, స్థలంతో సహా న్యూస్ వినిపిస్తోంది. ఈ తరుణంలో ఓ యూట్యూబర్, అలియాభట్ అభిమాని చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ అభిమాని యూట్యూబ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో.. ఆ ఫ్యాన్ ఏడుస్తూ రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటాడు. కెమెరాని ముందువైపు చూపించగా.. అతని ముందు ఓ కారు వెళుతూ ఉంటుంది. దానికి ‘అలియా వెడ్స్ రణ్‌బీర్’ అనే బ్యానర్ ఉంటుంది. అంటే.. రణ్‌బీర్‌తో పెళ్లైన అలియా వెళుతున్న కారు వెనుక ఏడుస్తూ ఆ అభిమాని పరిగెత్తుతున్నాడన్నమాట. అంతేకాకుండా ఆ వీడియోకి.. ‘ఏప్రిల్ 17న నేను’ అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.


ఈ వీడియోపై స్పందించిన అలియా భట్.. ‘డెడ్’ అంటూ రాసుకొచ్చింది. అంటే రివర్స్‌లో పరిగెడుతున్నావా అంటూ కామెంట్ చేసింది. దానికి ఆ అభిమాని మీకు లోపల నుంచి అలాగే కనిపిస్తున్నానేమోనని రిప్లై ఇచ్చాడు. ఈ వైరల్ వీడియోపై ఎంతోమంది అలియా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మా పరిస్థితి కూడా అదేనంటూ కొందరూ.. బాధగా ఉందంటూ మరికొందరు కామెంట్స్‌లో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2022-04-11T19:47:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!