సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Alia Kapoor వన్ మంత్ యానివర్సరీ... సరికొత్త ఫోటోలు షేర్ చేసిన మిసెస్ Ranbir...

ABN, First Publish Date - 2022-05-15T04:03:56+05:30

మిసెస్ ఆలియా కపూర్ తన వెడ్డింగ్ మూడ్ లోంచి ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించటం లేదు. తాజాగా ఆమె మరిన్ని ఫోటోలు షేర్ చేసింది. రణబీర్ తో (Ranbir) ఆలియా (Alia) పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావటంతో తమ వన్ మంత్ యానివర్సరీ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ మెహందీ, పోస్ట్-వెడ్డింగ్ పార్టీ ఫోటోల్ని నెటిజన్స్ ముందుకు తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిసెస్ ఆలియా కపూర్ తన వెడ్డింగ్ మూడ్ లోంచి ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించటం లేదు. తాజాగా ఆమె మరిన్ని ఫోటోలు షేర్ చేసింది. రణబీర్ తో (Ranbir) ఆలియా (Alia) పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావటంతో తమ వన్ మంత్ యానివర్సరీ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ మెహందీ, పోస్ట్-వెడ్డింగ్ పార్టీ ఫోటోల్ని నెటిజన్స్ ముందుకు తెచ్చింది.


ఆలియా అభిమానులతో పంచుకున్న సరికొత్త ఫోటోలకి కామెంట్స్ సెక్షన్లో హార్ట్ ఎమోజీస్ వెల్లువెత్తాయి. చాలా మంది తమ ప్రేమని కొత్త జంటపై కురిపించారు. ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ కూడా కామెంట్ చేశారు... 


ఆలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి ఏప్రెల్ 14న జరిగిన సంగతి మనకు తెలిసిందే. దగ్గరి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే వేడుకలకి హాజరయ్యారు. రణబీర్ ఇంట్లో ఆలియా పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. 


ఇక కెరీర్ విషయానికి వస్తే... ఆలియా, రణబీర్ ఇద్దరూ త్వరలోనే ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కలసి కనిపించబోతున్నారు. అలాగే, రణబీర్ మన ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ‘యానిమల్’ మూవీ చేస్తున్నాడు. మరోవైపు ఆలియా కూడా ఫుల్ బిజీగా ఉంది. ఆమె కరణ్ జోహర్ దర్శకత్వంలో రణవీర్ తో ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ‘హార్ట్ ఆప్ స్టోన్’ సినిమాలో గాల్ గాడోట్, జేమీ డోర్మాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో కలసి నటిస్తోంది. అలాగే, ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో ‘జీ లే జరా’ సినిమా చేస్తోంది. అందులో ఆలియాతో పాటూ ప్రియాంక, కత్రీనా కూడా తెరపై కనిపించనుండటం ఇప్పట్నుంచే అంచనాలు పెంచేస్తోంది... 

Updated Date - 2022-05-15T04:03:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!