సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pregnancy వల్ల సినిమాలు ఆలస్యమవుతున్నాయంటూ రూమర్స్.. కోపంతో Alia Bhatt రియాక్షన్ ఇదీ..

ABN, First Publish Date - 2022-06-29T16:52:30+05:30

బాలీవుడ్ క్రేజీ కపుల్ అలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ క్రేజీ కపుల్ అలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని జూన్ 27న సోషల్ మీడియా వేదికగా అలియా తెలియజేసింది. దీంతో ఎంతోమంది అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ తరుణంలో అలియా ఇప్పటికే కమిటైన సినిమాల పరిస్థితి ఎంటని అందరికీ సందేహం వచ్చింది. దీంతో తన సినిమాలు ఆలస్యమవుతాయని ప్రచారం జరిగింది. దీనిపై ఓ వెబ్‌సైట్ వార్తను ప్రచురించింది. తాజాగా ఈ రూమర్స్‌పై అలియా స్పందించింది.


ఈ విషయంపై సోషల్ మీడియాలో అలియా చేసిన పోస్ట్‌లో.. ‘మనం ఇప్పటికీ పితృస్వామ్య ప్రపంచంలో జీవిస్తున్నాం. పాతకాలం భావనల్లోనే ఇంకా చాలామంది ఉన్నారు. నా సినిమాలు ఏవీ ఆలస్యం అవట్లేదు. ఎవరినీ ఎవరూ పైకి తీసుకురావాల్సిన పని లేదు. నేను ఓ మహిళని పార్సెల్‌ని కాదు. నేను విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి డాక్టర్ సలహా మేరకే చేస్తానని తెలుసుకుంటే మంచిది. మనం 2022లో ఉన్నాం. ఇప్పటికైనా అలాంటి ఆలోచనా విధానం నుంచి బయటపడితే మంచిది. ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తే.. నేను షూటింగ్‌కి వెళ్లాలి’ అని కోపంతో వెటకారంగా రాసుకొచ్చింది.


కాగా.. తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అలియా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే ఈ బ్యూటీ ప్రస్తుతం ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart Of Stone)’ హాలీవుడ్ మూవీలో, ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani)’ అనే బాలీవుడ్‌ మూవీలో నటిస్తోంది.

Updated Date - 2022-06-29T16:52:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!