Oscar Awards: ఆస్కార్‌కు ఆలియా.. నిజమేనా?
ABN , First Publish Date - 2022-08-28T22:50:27+05:30 IST
ఆస్కార్‌కు ఆలియాభట్ సినిమా.. నిజమేనా; ప్రస్తుతం బీటౌన్‌లో జరుగుతున్న చర్చ ఇది. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ వేదికపై ఈ ఏడాది భారతీయ చిత్రాలు గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి అని కొద్దిరోజులుగా చర్చ నడుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఏడాది ఆస్కార్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ గతవారం ఎడిషన్‌లో పేర్కొంది.
ఆస్కార్‌కు ఆలియాభట్ (Alia bhatt)సినిమా.. నిజమేనా; ప్రస్తుతం బీటౌన్‌లో జరుగుతున్న చర్చ ఇది. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’(Oscar awards) వేదికపై ఈ ఏడాది భారతీయ చిత్రాలు గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి అని కొద్దిరోజులుగా చర్చ నడుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఏడాది ఆస్కార్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ గతవారం ఎడిషన్‌లో పేర్కొంది. కొమురం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. తాజాగా బాలీవుడ్ చిత్రం కూడా రేసులో ఉందని సమాచారం. ఆలియాభఠ్ కీలక పాత్రలో నటించిన ‘గంగూభాయ్ కతియావాడి’ (Gangubai Kathiawadi)చిత్రం కూడా ఈసారి ఆస్కార్ బరిలో ఉండనుందనే వార్త బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని సంజల్లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో ఆలియా నటనకు ిమంచి గుర్తింపు రావడంతోపాటు విమర్శకులు ప్రశంసలు కూడా అందుకొంది. తాజాగా ఈ చిత్రం బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ కారణాలతోనే గంగూభాయ్ చిత్రం ఆస్కార్బరిలో ఉందని భన్సాలీ తెలిపారు. ఈ వార్తను చూసి ఆలియా అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.