సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

South vs Hindi debate: మొదటి సారి స్పందించిన Alia Bhatt.. ఇక్కడ అలాంటి సినిమాలు లేవంటూ..

ABN, First Publish Date - 2022-06-16T19:41:53+05:30

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అనంతరం విడుదలైన ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter 2)’ సైతం మంచి హిట్ సాధించింది. అంతేకాకుండా.. అదే సమయంలో విడుదలైన పలు బాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సౌత్ వర్సెస్ హిందీ సినిమాల చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించారు. అయితే.. ఆర్ఆర్‌ఆర్ సినిమాతో దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోనూ గుర్తింపు సాధించిన బాలీవుడ్ నటి అలియా భట్ మాత్రం దీనిపై కామ్‌గా ఉంది. తాజాగా ఈ బ్యూటీ సైతం ఈ వివాదంపై మాట్లాడింది. 


భర్త రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor)తో కలిసి అలియా నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర (Bhramastra): పార్ట్ 1 శివ’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలకానుంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సౌత్ వర్సెస్ హిందీ సినిమాల చర్చపై స్పందించింది.


అలియా మాట్లాడుతూ.. ‘ఇక్కడ హిందీ, తమిళం, తెలుగు అని వేరు వేరు సినిమాలు లేవు. కేవలం భారతీయ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ మూవీ మీకోసమే అని చూసే ప్రేక్షకులకి భావన కలగాలి. అప్పుడు కచ్చితంగా అందరూ ఆదరిస్తారు. కొన్నిసార్లు మీకోసం కాదనే భావన వస్తుంది. కానీ అది నిజం కాదు. సినిమా అందరి కోసం’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-06-16T19:41:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!