సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Alia Bhatt and Ranbir Kapoor: తల్లిదండ్రులైన క్యూట్ కపుల్.. పుట్టింది ఏవరో తెలుసా?

ABN, First Publish Date - 2022-11-06T18:43:45+05:30

బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt ), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి. ఈ ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఈ జంటకి చాలా మంచి జరిగింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt ), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి. ఈ ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఈ జంటకి చాలా మంచి జరిగింది. ఈ జంట కలిసి నటించిన మొదటి చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సెప్టెంబర్ 9న విడుదల రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లని కొల్లగొట్టింది. అలాగే.. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లిపీటలు ఎక్కింది. మూడు నెలలు తిరక్కుండా ఆలియా గర్భవతి కూడా అయ్యింది. తాజాగా ఈ జంటకి మరోసారి అదృష్టం కలిసొచ్చింది.


ఇటీవలే ఆలియాకి సీమంతం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ భామ దాదాపు బయటికి రావడమే మానేసిందని చెప్పాలి. కాగా.. గత కొన్ని రోజులుగా ఆలియా డెలివరీ సమయం దగ్గర పడిందని, అందుకే హాస్పిటల్‌లో ఉందని వార్తలు వినిపించాయి. కాగా.. ఈ రోజు (నవంబర్ 6న) ఆలియాకి ప్రసవం అయ్యింది. సరిగ్గా 12.05 గంటలకి పండంటి ఆడబిడ్డ (Girl)కి ఈ బ్యూటీ జన్మనిచ్చింది. దాంతో భట్, కపూర్ కుటుంబాల ఆనందానికి అవధులు లేవట. వారి మొదటి బిడ్డని చూసి ఈ జంట కూడా చాలా ఆనందంగా ఉందని తెలుస్తోంది.


కాగా.. ఆలియా భట్ ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీ లే జరా’, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’, అలాగే వండర్ వుమెన్ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ఓ హాలీవుడ్ మూవీ చేస్తోంది. మరో వైపు.. రణ్‌బీర్ సైతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’, లవ్ రంజన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Updated Date - 2022-11-06T18:43:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!