సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బేబీ రాబోతోంది.. ఫ్యాన్స్‌కి శుభవార్త చెప్పిన Alia Bhatt..

ABN, First Publish Date - 2022-06-27T18:27:17+05:30

బాలీవుడ్‌లో క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఐదేళ్ల డేటింగ్ చేసిన ఈ లవ్‌బర్డ్స్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఐదేళ్ల డేటింగ్ చేసిన ఈ లవ్‌బర్డ్స్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒకటైన విషయం తెలిసిందే. మ్యారేజ్ అయ్యి మూడు నెలల్లోపే ఈ బ్యూటీఫుల్ కపుల్ ఫ్యాన్స్‌కి మరో శుభవార్తని తెలియజేశారు. వారు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనేది ఆ వార్తా సారాంశం. ఈ విషయాన్ని తెలియజేస్తూ అలియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.


ఆస్పత్రిలో స్కానింగ్‌ చేసుకున్న ఫొటోలను అలియా తన ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దానికి ‘మా బెబీ.. త్వరలో రాబోతోంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో అలియా, రణ్‌బీర్ దంపతులకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-06-27T18:27:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!