సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akshay Kumar: పెళ్లయిన కొత్త జంట Ranbir Kapoor, Alia Bhatt లకు, మీరిచ్చే సలహా ఏంటని అక్షయ్‌ను అడిగితే..

ABN, First Publish Date - 2022-07-22T21:24:21+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). గతంలో ఈ చాట్ షో ఆరు సీజన్‌లు ప్రసారమయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా కరణ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). గతంలో ఈ చాట్ షో ఆరు సీజన్‌లు ప్రసారమయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా కరణ్ జోహార్ 7వ సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్‌’ (Disney+Hotstar) లో ఈ చాట్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీజన్‌కు సౌత్ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడో ఎపిసోడ్‌కు హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha) హాజరయింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో కలసి సందడి చేసింది. ఈ ఎపిసోడ్‌లో కరణ్ జోహార్ అనేక ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు.  


ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా కరణ్ జోహార్ కొత్తగా పెళ్లి చేసుకున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల‌కు మీరిచ్చే సలహా ఏంటని అక్షయ్ కుమార్‌ను అడిగాడు. అందుకు అక్కీ..‘హ్యపీ వైఫ్, హ్యాపీ లైఫ్’ అని సమాధానమిచ్చాడు. ఆలియా భట్‌పై ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. ఈ రౌండ్‌లో అక్షయ్ అందరి చేత నవ్వులు పూయించాడు. విజేతగా నిలచి హ్యాంపర్‌ను గెలుచుకున్నాడు. షోలో భాగంగా.. బాలీవుడ్‌లో ఇద్దరు, ముగ్గురు హీరోలు కలసి సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని అక్షయ్ పేర్కొన్నాడు. హీరోయిన్స్ కలసి కట్టుగా పనిచేస్తున్నారన్నాడు. తాను ‘మిషన్ మంగళ్’ లో ఐదుగురు హీరోయిన్స్‌తో కలసి నటించానని వెల్లడించాడు.

Updated Date - 2022-07-22T21:24:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!