పచ్చ గడ్డి తినిపించటంలో ఆనందం పొందుతోన్న AKSHAY

ABN , First Publish Date - 2022-01-24T00:31:45+05:30 IST

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడనే సంగతి తెలిసిందే

పచ్చ గడ్డి తినిపించటంలో ఆనందం పొందుతోన్న AKSHAY

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడనే సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..


బాలీవుడ్ ‘ఖిలాడీ’ స్టార్ తన తాజా వీడియోలో.. మేకలకు పచ్చగడ్డిని తినిపిస్తున్నారు. జంతువులు అతడి మీదకు ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రేమను కురిపిస్తున్నాయి. జంతువులు అలా చేయడంతో అక్షయ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. అతడు హీరోగా నటించిన ‘కేసరీ’ సినిమాలోని పాట బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. వీడియో కింద అక్షయ్ కామెంట్ కూడా పోస్ట్ చేశాడు. ‘‘చిన్న, చిన్న అంశాల్లోనే పెద్ద, పెద్ద ఆనందాలు దొరుకుతాయి. ప్రకృతి వలనే మనం బతుకుతున్నాం. థ్యాంక్ యూ గాడ్’’ అంటూ అక్షయ్ తన మనోభావాల్ని నెటిజన్స్‌తో పంచుకున్నాడు.   


ఇక కెరీర్ విషయానికి వస్తే... సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా ‘బచ్చన్ పాండే’. కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2022, మార్చి 4న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ‘బచ్చన్ పాండే’ ను మార్చి 18న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.Updated Date - 2022-01-24T00:31:45+05:30 IST