Ajay Devgn: బాలీవుడ్‌కి మరిన్ని ‘దృశ్యం’లు కావాలి.. అప్పుడే..
ABN , First Publish Date - 2022-11-22T19:32:35+05:30 IST
అజయ్ దేవగన్, టబు, శ్రియా శరణ్, అక్షయ్ ఖన్నా ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం 2’..

అజయ్ దేవగన్ (Ajay Devgn), టబు (Tabu), శ్రియా శరణ్ (Shriya Saran), అక్షయ్ ఖన్నా ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం 2’ (Drishyam 2). నవంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ విజయంలో చాలా కాలం తర్వాత ఓ బాలీవుడ్ (Bollywood) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించినట్లైంది. స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌గా మిగిలినప్పటికీ ఈ సినిమా విజయంతో బీ టౌన్‌లో కొంచెం జోష్ వచ్చింది. ఈ తరుణంలో అజయ్ దేవగన్ మాట్లాడుతూ బాలీవుడ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు చాలా తెలివిగా అయిపోయారు. అందుకే మీరు వారికి చెత్త తీసి చూపిస్తే ఒప్పుకోవట్లేదు. కమర్షియల్ సినిమాలతో వినోదం అందిస్తున్నప్పటికీ వాటిలో కూడా వారికి కొత్తదనం కావాలి. అలాగే.. బాలీవుడ్‌ని ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. దానికి దృశ్యం టానిక్‌లా ఉపయోగపడింది. ఈ పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడటానికి మరో మూడు, నాలుగు దృశ్యంలాంటి సినిమాలు కావాలి’ అని చెప్పుకొచ్చాడు.
ఇటీవలే విడుదలైన ‘దృశ్యం 2’ ఇప్పటికే దాదాపు రూ.70 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళుతోంది. త్వరలోనే రూ.100 కోట్ల మార్కును దాటుతుందని బాక్సాఫీస్ ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. అజయ్ దేవ్‌గణ్ ప్రస్తుతం తమిళంలో కార్తీ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కైతీ’ (తెలుగులో ఖైదీ)ని రిమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read more