సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sasanasabha: టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ.. ఈసారి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో..

ABN, First Publish Date - 2022-09-04T17:49:30+05:30

‘వెంకటాపురం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు మడికంటి. చాలా గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు చేస్తున్న మరో చిత్రం ‘శాసన సభ (Sasanasabha)’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘వెంకటాపురం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు మడికంటి. చాలా గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు చేస్తున్న మరో చిత్రం ‘శాసన సభ (Sasanasabha)’. పాన్ ఇండియా స్థాయిలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి.. సప్పని బ్రదర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.


ఈ సినిమాలో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ (Aishwarya Raj) హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తోపాటు రాజేంద్ర ప్రసాద్‌ లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ లుక్స్ మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటించిన పృథ్వీరాజ్ సినిమాతో గుర్తింపు పొందిన నటి ఐశ్వర్య రాజ్ భకుని. ఈ బ్యూటీ కూడా తాజాగా ఈ సినిమాలో భాగమైనట్లు మూవీ టీం తెలిపింది. ఈ భామ ఈ సినిమాలో నటనకి స్కోప్ ఉన్న భావన అనే పాత్రలో నటించనుందని సమాచారం. అలాగే.. 7G బృందావన్ కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ నటిస్తున్నారు. గార్జియస్ బ్యూటీ హెబ్బా పటేల్ సైతం స్పెషల్ సాంగ్‌లో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించనున్నాడు.

Updated Date - 2022-09-04T17:49:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!