అతియా శెట్టితో క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లంటూ వార్తలు.. ఆమె అన్నయ్య ఏమన్నాడంటే..
ABN, First Publish Date - 2022-05-04T21:25:22+05:30
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే...
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. గత కొన్నినెలలుగా ఈ జంట పెళ్లి గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ లవ్‌బర్డ్స్ పెళ్లి గురించి మరో క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ కపుల్ ఈ ఏడాదిలోనే ఒకటి కాబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. ఈ వార్తలపై అతియా శెట్టి సోదరుడు, బాలీవుడ్ నటుడు అహాన్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
అహాన్ మాట్లాడుతూ.. ‘మేము ప్రతి సంవత్సరం ఈద్‌ని మా తాత ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. ఈసారి అలాగే వెళ్లాం. అయితే.. మా మధ్య పెళ్లికి సంబంధించిన విషయాలు చర్చకు రాలేదు. పెళ్లికి కోసం ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు. అలాంటి వేడుక ఏది లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే. పెళ్లి నిజంగా లేనప్పుడు మీకు డేట్ చెప్పలేం కదా. ఇప్పటికయితే ఎటువంటి నిశ్చితార్థం జరగలేదు. సమీప భవిష్యత్తులో అలాంటి ప్రణాళిక లేదు. రాబోయే కొద్ది నెలల్లో పెళ్లికి కూడా ఎటువంటి ప్రణాళిక లేదు’ చెప్పుకొచ్చాడు.