సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Siddhaanth Vir Surryavanshi: జిమ్ చేస్తూ మరో నటుడి మృతి

ABN, First Publish Date - 2022-11-11T22:04:32+05:30

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టర్‌గా మారిన నటుడు సిద్దార్థ్ వీర్ సూర్యవంశీ (Siddhaanth Vir Surryavanshi). కుసుమ్ (Kkusum) షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టర్‌గా మారిన నటుడు సిద్దార్థ్ వీర్ సూర్యవంశీ (Siddhaanth Vir Surryavanshi). కుసుమ్ (Kkusum) షోతో టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘కసౌతి జిందగీ కే’, ‘కృష్ణ అర్జున్’, ‘క్యా దిల్ మే హై’ వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. సిద్దార్థ్ నవంబర్ 11న జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహను కోల్పోయాడు. గుండెపోటుకు గురయ్యాడు. కోకిలా బెన్ ఆస్పత్రికి తరలించేలోగా మరణించాడు.  


సిద్దార్థ్ గతంలో ఐరా (Ira) ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కూతురు ఉంది. కొన్నాళ్లకు ఈ జంట మధ్య అనేక విభేదాలు తలెత్తాయి.  ఫలితంగా వీరు 2015లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సిద్దార్థ్ మరో పెళ్లి చేసుకున్నాడు. సూపర్ మోడల్ అలేసియా రౌత్‌ను 2017లో వివాహమాడాడు. సిద్దార్థ్ మృతితో టీవీ పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సెలబ్రిటీలందరు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. కొన్నాళ్ల క్రితం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) జిమ్ చేస్తూనే మరణించిన సంగతి తెలిసిందే. నటులు అంటే ఫిట్‌గా ఉండాలి. అందుకోసం చెమటోడ్చాక తప్పదు. కానీ, ట్రైనర్ లేకుండా ఇటువంటి కసరత్తులు చేస్తుండటంతో ప్రమాదానికి గురై వారు మరణిస్తున్నారు. 



Updated Date - 2022-11-11T22:04:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!