సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

భార్యతో బాలీవుడ్ హీరో మిర్రర్ సెల్ఫీ.. కాసేపటికే డిలీట్.. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే..

ABN, First Publish Date - 2022-01-27T21:52:21+05:30

బాలీవుడ్‌లో భిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్ కుమార్ రావ్. గత ఏడాది నవంబర్ 15న పత్ర లేఖను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో భిన్న రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్ కుమార్ రావ్. గత ఏడాది నవంబర్ 15న పత్ర లేఖను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తన భార్యతో తీసుకున్న మిర్రర్ సెల్ఫీని తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఫోటోలో హీరో భార్య హాట్‌గా ఫోజిచ్చింది. పత్ర లేఖ తెలుపు దుస్తులు, నలుపు బూట్లు ధరించి కనిపించింది. రాజ్ కుమార్ రావ్ రెడ్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్‌‌ను ధరించాడు. ఈ ఫోటోని ‘‘ మిర్రర్ సెల్ఫీ. చెక్ బ్యూటీ, చెక్ షర్ట్, చెక్..’’ అనే కామెంట్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై అతడి భార్య పత్ర లేఖ స్పందిస్తూ ‘‘లవ్ యూ’’ అని కామెంట్ చేసింది. అయితే ఈ ఫొటోను చూసి నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు.


‘‘నేను నిజంగా కన్‌ఫ్యూజయ్యా.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది నేనొక్కన్నే కాదనుకుంటున్నా’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ ఫొటోను అర్థం చేసుకునే సరికే నా మైండ్ పోయింది’’ అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇలా నెటిజన్ల నుంచి ఇటువంటి కామెంట్లు వస్తాయని తొలుత రాజ్ కుమార్ రావ్ కూడా అనుకొని ఉండరేమో. అందుకే ఆ ఫొటోను డిలీట్ చేశాడు.



Updated Date - 2022-01-27T21:52:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!