సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘లైగర్’ బ్యూటీ వన్స్ ఎగైన్ సింగిల్! Ishaan Khatterతో Ananya Panday బ్రేకప్!

ABN, First Publish Date - 2022-04-05T00:24:52+05:30

బాలీవుడ్ యంగ్ కపుల్ అనన్య పాండే, ఇషాన్ కట్టర్ ఏనాడూ తమ రియల్ లైఫ్ రొమాన్స్ గురించి మాట్లాడలేదు. కానీ, మౌనంగా సాగిన వారి ముద్దు, మురిపాలు దురదృష్టవశాత్తూ ముగింపుకొచ్చాయట. అసలు కన్‌ఫర్మ్ చేయని వారి లవ్‌స్టోరీకి అప్పుడే ఎండ్ కార్డ్ పడిందని బీ-టౌన్ టాక్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ యంగ్ కపుల్ అనన్య పాండే, ఇషాన్ కట్టర్ ఏనాడూ తమ రియల్ లైఫ్ రొమాన్స్ గురించి మాట్లాడలేదు. కానీ, మౌనంగా సాగిన వారి ముద్దు, మురిపాలు దురదృష్టవశాత్తూ ముగింపుకొచ్చాయట. అసలు కన్‌ఫర్మ్ చేయని వారి లవ్‌స్టోరీకి అప్పుడే ఎండ్ కార్డ్ పడిందని బీ-టౌన్ టాక్... 


షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్, చంకీ పాండే కూతురు అనన్య మూడేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. వారి మధ్య అగ్గి రాజుకుంది ‘ఖాళీపీలి’ సినిమా సమయంలో. అయితే, అప్పట్లో ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై డేటింగ్ మొదలు పెట్టినప్పటికీ బహిరంగంగా మాత్రం ‘ఔననీ, కాదనీ’ చెప్పలేదు. అప్పుడప్పుడూ డిన్నర్ డేట్స్ సమయంలో పాపరాజీ కెమెరాలకు మాత్రం చిక్కుతుండేవారు. కొన్నాళ్ల క్రితమే అనన్య ఇషాన్ అన్నయ్య షాహిద్ బర్త్ డే పార్టీకి కూడా అటెండ్ అయింది. ఆ పోటోలు సొషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇక అనన్య తన రిలేషన్‌షిప్ అఫీషియల్ చేసేస్తుందని అంతా భావించే సమయంలో వారిద్దరి బ్రేకప్ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. 


యంగ్ అండ్ హ్యాపెనింగ్ జోడీ అనన్య, ఇషాన్ పరస్పర అంగీకారంతోనే విడిపోయారని ముంబైలో చెప్పుకుంటున్నారు. వారి మధ్య ఎటువంటి కోపతాపాలు లేవని అంటున్నారు. కాకపోతే, ఇషాన్, అనన్య తమతమ జీవితాల్ని చూసే తీరు వేరువేరుగా ఉండటమే బ్రేకప్ కారణమట. తమ ఆలోచనలు కలవకపోవటంతో లవ్వర్స్‌గా విడిపోయి ఫ్రెండ్స్‌గా కంటిన్యూ అవ్వనున్నారట. మంచి సబ్జెక్ట్‌తో ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ తమ వద్దకొస్తే వారు సినిమా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బీ-టౌన్ జనం! చూడాలి మరి, ‘లైగర్’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న మిస్ పాండే నెక్ట్స్ ఎవరికి, ఎప్పుడు... తన వలపుల్ని పంచుతుందో! 

Updated Date - 2022-04-05T00:24:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!