Om raut: ‘అవతార్‌ 2’ని ప్రశంసించిన ‘ఆదిపురుష్’ దర్శకుడు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-12-15T10:53:19+05:30 IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్’ (Avatar) మేనియా నడుస్తోంది. 13 ఏళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన ఈ అద్భుతానికి సీక్వెల్‌గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) వస్తోంది.

Om raut: ‘అవతార్‌ 2’ని ప్రశంసించిన ‘ఆదిపురుష్’ దర్శకుడు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్’ (Avatar) మేనియా నడుస్తోంది. 13 ఏళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన ఈ అద్భుతానికి సీక్వెల్‌గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) వస్తోంది. డిసెంబర్ 16న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రత్యేక స్క్రీనింగ్స్ జరుగతున్నాయి. ఈ సినిమా ప్రత్యేక పదర్శన తాజాగా ముంబైలో కూడా జరిగింది. దీనికి అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, బాబీ డియోల్, కార్తీక్ ఆర్యన్, ఓం రౌత్ (Om Raut) వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం వీరందరూ ఈ సినిమా గురించి రివ్యూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

అందులో ‘ఆదిపురుష్’ (Adipurush) దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని ఐమాక్స్ 3డీ (IMAX 3D)లో చూడటం ఒక అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అవతార్‌ని ప్రశంసించిన ఓం రౌత్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ఓం రౌత్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పడం చూస్తే నాకు ఏడుపు వస్తుంది’ అని ఒకరు.. ‘‘ఓం ప్రత్యేకంగా ‘3D’ అనే పదాన్ని నొక్కి చెప్పడం నాకు నవ్వు తెప్పించింది. ‘3D’లో చూడటానికి ప్రత్యేకంగా తీసిన సినిమా అంటే ఏమిటో అతను తెలుసుకున్నట్లు కనిపిస్తోంది’ అని ఇంకొకరు.. ‘‘ఓం ఈ మాస్టర్‌పీస్‌ని చూస్తే.. అతను మరో 3 సంవత్సరాల పాటు అంటే 2026 తర్వాత ‘ఆదిపురుష్‌’ విడుదల చేస్తాడు’ అని మరొకరు.. ‘ఓం రౌత్ నిజమైన 3డీ చిత్రాన్ని చూస్తున్నాడు. ఇప్పటికైనా అతను ఏం తీశాడో తెలుసుకుంటానడని అనుకుంటున్నా’ అని వేరొకరు రాసుకొచ్చారు.

అయితే.. గత కొన్ని రోజుల క్రితం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో వీఎఫ్‌ఎక్స్ చూసి చాలామంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే.. యానిమేటేడ్ చిత్రంలా కనిపించడం, రావణుడికి స్పైక్స్ ఉండడం వంటి పలు అంశాలపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో ఆయన ‘అవతార్ 2’ని ప్రశంసించడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T11:15:36+05:30 IST